![]() |
![]() |

ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో సీజన్ 4 లాంచింగ్ ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్స్ వచ్చి జడ్జెస్ ని ఇంప్రెస్స్ చేసేలా పడుతూ వెళ్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో వైజాగ్ నుంచి వచ్చిన 26 ఏళ్ళ శ్రీనివాస్ సాంగ్ కి ఫిదా ఇపోయారు జడ్జెస్ ముగ్గురు. శ్రీనివాస్ పుట్టిన దగ్గర నుంచే తనకు కళ్ళు కనిపించవు అని చెప్పాడు. ఇక థమన్ "ఏ సాంగ్ పాడుతున్నావ్" అని అడిగేసరికి..."ఒక మారు" అనే సాంగ్ పడుతున్నా అని చెప్పాడు. "ఓహ్ అది కార్తీక్ సాంగ్ కదా కార్తీక్ అంటే ఇష్టమా" అని అడిగాడు. "అవును అలాగే మీరు నా ఫెవరేట్ మ్యూజిక్ డైరెక్టర్" అని చెప్పాడు. "ఏ మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇష్టం" అని కార్తీక్ అడిగాడు. "వయోలిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇష్టం భాగమతి మూవీ కూడా ఇంకా ఇష్టం, నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ ని" అని చెప్పాడు. "వీళ్లందరినీ మీరు ఎలా ఊహించుకుంటారు " అని గీత మాధురి అడిగింది. డైలాగ్స్ వింటూ యాక్షన్ లో ఊహించుకుంటాను అని చెప్పాడు.
ఇక థమన్ డీటెయిల్స్ తెలుసుకున్నాడు. సౌండ్ ప్రకారం ఊహించుకుని నీ సొంత ప్రపంచంలో ఉండడం గొప్ప విషయం కంటి చూపు విషయంలో డాక్టర్స్ ఎం చెప్పారో తెలుసుకుని...తామిద్దరం కలిసి తెలిసిన ఐ డాక్టర్స్ కి చూపిస్తామని చెపారు.. శ్రీనివాస్ సిస్టర్ కి నంబర్ ఇచ్చి తనను కాంటాక్ట్ చేయమన్నారు థమన్, కార్తీక్. మంచి టాలెంట్ ఉంది కదా కళ్ళుంటే ఇంకా బాగా పాడతారు కదా అందుకే మేము నిన్ను డాక్టర్స్ కి చూపిస్తాం అని చెప్పాడు థమన్. ఇక ఈ సాంగ్ కార్తిక్ పాడిన తర్వాత శ్రీనివాస్ గొంతులోనే బాగుంది అంటూ థమన్ కితాబిచ్చాడు. ఇక కార్తిక్ ఐతే శ్రీనివాస్ కి హెడ్ ఫోన్స్ ని గిఫ్ట్ గా ఇచ్చి "ఒక మారు" సాంగ్ ని అతనితో కలిసి పాడాడు. ఇక ముగ్గురు జడ్జెస్ శ్రీనివాస్ దగ్గరకు వెళ్లి గోల్డెన్ టికెట్ ఇచ్చారు.
![]() |
![]() |